BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 07:56 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

చిన్న అలవలపాడు సర్పంచ్ అభ్యర్థిగా లక్ష్మీ సౌజన్య శీలం ప్రకటన

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
13 Nov, 2026 - 07:56 PM
21 వీక్షణలు

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయానికి సమష్టిగా కృషి చేయాలి: వైఎస్సార్‌సీపీ కనిగిరి ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్

కనిగిరి: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు.

స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం కనిగిరి మండల పార్టీ అధ్యక్షుడు మడతల కస్తూరి రెడ్డి ఆధ్వర్యంలో చిన్న అలవలపాడు పంచాయతీకి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, చేపట్టాల్సిన కార్యాచరణపై నాయకులు, ముఖ్య కార్యకర్తలు విస్తృతంగా చర్చించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న వారి ఏకాభిప్రాయం మేరకు చిన్న అలవలపాడు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా లక్ష్మీ సౌజన్య శీలం పేరును దద్దాల నారాయణ యాదవ్ ప్రకటించారు.

ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికలను పార్టీ శ్రేణులంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అన్నారు. ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కనిగిరి నియోజకవర్గంలో అరాచక రాజకీయాలకు పాల్పడిందని ఆయన విమర్శించారు. ఎంపీటీసీ ఎన్నికల సమయంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసుల సమక్షంలోనే టీడీపీకి చెందిన వారు అడ్డుకుని, నామినేషన్లు వేయకుండా ఆటంకాలు సృష్టించారని ఆరోపించారు.

అధికార అండతో పోలీసు యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై ఒత్తిళ్లు, బెదిరింపులకు పాల్పడ్డారని దద్దాల నారాయణ యాదవ్ విమర్శించారు. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి బెదిరింపులకు, ప్రలోభాలకు భయపడకుండా ఐకమత్యంతో ఎన్నికలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ శీలం శ్రీనివాసులు రెడ్డి, శీలం వెంకటేశ్వర రెడ్డి, వేమన ఆదినారాయణ, శెట్టిపల్లి సుబ్బారావు, శీలం శివారెడ్డి, మల్లెల యేసు, గాలిబోయిన నాగార్జున, మాలపాటి మాల్యాద్రి, బొబ్బ కోటిరెడ్డి, గొల్లపోలు శ్రీనివాసులు, మండాది బాలనాగిరెడ్డి, ఉండేల కృష్ణారెడ్డి, చిలంకూరు చిన్నకోటయ్య, శెట్టిపల్లి కిషోర్, ఉండేలా వెంకటసుబ్బయ్య, సంగటి పుల్లారెడ్డి, మల్లెల మహేష్, కుమ్మరకుంట ప్రభాకర్, బాలసాని మార్కు, ఏల్లూరు షెడ్రక్, మల్లెలు ఏసు, రోశయ్యతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.