BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 03:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రారంభించిన ఏడాదిలోపే మధిర 100 పడకల ఆసుపత్రిలో లీకేజీలు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Sep, 2026 - 03:58 PM
33 వీక్షణలు

సిబ్బంది కొరతతో రోగులకు ఇబ్బందులు.. ఆసుపత్రి ప్రాంగణంలో నిలిచిన వర్షపు నీరు

మధిర: మధిరలో ఇటీవల ప్రారంభించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనంలో వర్షానికి లీకేజీలు ఏర్పడటంతో పాటు, ఆసుపత్రిలో సిబ్బంది కొరత కారణంగా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం నాయకులు ఆరోపించారు. శుక్రవారం సీపీఎం బృందం ఆసుపత్రిని సందర్శించి భవనం, ఆసుపత్రి పరిసరాల పరిస్థితిని పరిశీలించింది.

ఈ సందర్భంగా సీపీఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు మాట్లాడుతూ.. మధిర ప్రాంత ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో సుమారు రూ.34 కోట్లతో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే ప్రారంభించిన ఏడాదిలోపే వర్షానికి భవనంలో లీకేజీలు ఏర్పడటం ఆందోళన కలిగించే అంశమన్నారు.

ఆసుపత్రి నిర్మాణానికి సుమారు రూ.30 కోట్లు, వైద్య పరికరాలు, ఇతర సామగ్రి కోసం మరో రూ.4 కోట్లు కేటాయించినప్పటికీ ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రిలో 54 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 19 మంది మాత్రమే ఉన్నారని, వివిధ విభాగాల్లో అవసరమైన సిబ్బంది కొరత ఉందని తెలిపారు. ముఖ్యంగా స్టాఫ్ నర్సుల కొరత తీవ్రంగా ఉందని అన్నారు.

ఆసుపత్రిలో మూడు ఆపరేషన్ థియేటర్లు ఉండగా ప్రస్తుతం ఒకటి మాత్రమే వినియోగంలో ఉందని సీపీఎం నాయకులు తెలిపారు. గర్భిణీలకు అవసరమైన శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ముగ్గురు గైనకాలజిస్టులు అవసరం కాగా, ప్రస్తుతం గైనకాలజిస్టు లేకపోవడంతో ప్రసవ శస్త్రచికిత్సల కోసం మహిళలను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సి వస్తోందని పేర్కొన్నారు. చిన్నచిన్న వైద్య సమస్యలకు కూడా రోగులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి పంపుతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు.

వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటం, సకాలంలో వైద్య సేవలు అందించడంపై కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై ఆసుపత్రి అధికారుల వివరణ అందాల్సి ఉంది.

ఆసుపత్రి పరిసరాల్లో వర్షపు నీరు, మురుగునీరు నిలిచి చెరువులను తలపించే పరిస్థితి ఏర్పడిందని నాయకులు తెలిపారు. పరిశుభ్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రికి రావాల్సిన రూ.4 కోట్ల విలువైన వైద్య పరికరాలు, ఇతర సామగ్రి పూర్తిస్థాయిలో అందలేదని, వాటిని వెంటనే సమకూర్చాలని కోరారు.

ప్రతిరోజూ సుమారు 300 నుంచి 500 మంది వరకు రోగులు ఆసుపత్రికి వస్తున్న నేపథ్యంలో రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు, నర్సింగ్, ఇతర సిబ్బందిని తక్షణమే నియమించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ నాణ్యత, లీకేజీలపై అధికారులు సమగ్రంగా పరిశీలించి బాధ్యత వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సీపీఎం పార్టీ పోరాటాల ఫలితంగా ప్రారంభమైన 100 పడకల ఆసుపత్రిలో ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించకపోతే ప్రజలను సమీకరించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మడుపల్లి గోపాలరావు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు శీలం నరసింహారావు, పట్టణ మండల కార్యదర్శి పడకంటి మురళి, మందా సైదులు, డివిజన్ నాయకులు పాపినేని రామనర్సయ్య, తేలప్రోలు రాధాకృష్ణ, కిషోర్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.