BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 06:19 pm
Posted by : K MAHESH

సమ్మెలో పాల్గొనే ఆశా వర్కర్లకు సెలవులు మంజూరు చేయాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
13 Nov, 2026 - 06:19 PM
25 వీక్షణలు

ఉద్యోగ భద్రత, నెలకు రూ.18 వేల వేతనం చెల్లించాలని డిమాండ్.. ముల్కనూరు పీహెచ్‌సీ వైద్యాధికారికి సమ్మె నోటీసు

గార్ల, నవంబర్ 13: ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న సమ్మెకు మద్దతుగా విధుల నుంచి సెలవులు మంజూరు చేయాలని ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం గార్ల మండల పరిధిలోని ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యాధికారి వై. హనుమంతరావుకు సమ్మె నోటీసు అందజేశారు.

ఈ సందర్భంగా యూనియన్ మండల నాయకురాలు పి. రమాదేవి మాట్లాడుతూ.. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆందోళనలో భాగంగా ఈ నెల 15న జిల్లాస్థాయి సదస్సు, 16న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా 20వ తేదీన సమ్మె నోటీసులు అందజేసే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సమ్మె, ఆందోళన కార్యక్రమాల్లో ఆశా వర్కర్లు పాల్గొనేందుకు వీలుగా వారికి విధుల నుంచి సెలవులు మంజూరు చేయాలని వైద్యాధికారి వై. హనుమంతరావును కోరారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి సంబంధిత అధికారులు స్పందించాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ నాయకులు నమ్మి, బి. కౌసల్య, పద్మ, దేవి, హైమావతి, అరుణ తదితరులు పాల్గొన్నారు.