BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 09:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మైలవరంలో తూనికలు, కొలతల శాఖ అధికారుల మెరుపు దాడులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Nov, 2026 - 09:40 PM
11 వీక్షణలు

అన్‌వెరిఫైడ్ తూకం యంత్రాలతో బియ్యం విక్రయాలు.. 

కొలతల్లో తేడాలు గుర్తింపు ఫుడ్ లైసెన్స్ లేకుండానే వ్యాపార నిర్వహణ.. పలు కేసులు నమోదు అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్న వ్యాపారులపైనా చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ ఎన్టీఆర్ జిల్లా, మైలవరం: మైలవరం పట్టణంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించడం స్థానిక వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. పట్టణంలోని నూజివీడు రోడ్డు రామాలయం వీధిలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి బియ్యం విక్రయ దుకాణాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు పలు కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా ధ్రువీకరణ లేని తూకం యంత్రాలను వినియోగిస్తూ బియ్యం విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించినట్లు సమాచారం. అంతేకాకుండా విక్రయించే బియ్యం తూకంలో వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొలతల్లో తేడాల కారణంగా వినియోగదారులు చెల్లిస్తున్న ధరకు తగిన పరిమాణంలో బియ్యం అందడం లేదనే అంశం తనిఖీల్లో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. రైస్ టిక్కీ విక్రయాల్లోనూ తూకానికి, ధరకు మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించడంతో సంబంధిత వ్యాపారులపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. మరోవైపు కొన్ని దుకాణాల్లో అవసరమైన ఆహార భద్రత అనుమతులు, లైసెన్సులు లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా బియ్యం విక్రయాల్లో కల్తీ జరుగుతోందంటూ గత కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు మరింత విస్తృతంగా తనిఖీలు నిర్వహించి బియ్యం నాణ్యతను కూడా పరిశీలించాలని వినియోగదారులు కోరుతున్నారు. తూనికలు, కొలతల శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలతో నిబంధనలు పాటించని వ్యాపారుల్లో ఆందోళన నెలకొనగా, మరోవైపు వినియోగదారుల్లో మాత్రం కొంత ఊరట వ్యక్తమవుతోంది. అయితే కేవలం తూకం యంత్రాలు, కొలతలకే పరిమితం కాకుండా బియ్యం విక్రయ ధరలపైనా అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. మార్కెట్ ధరల కంటే అధిక ధరలకు బియ్యం విక్రయిస్తూ వినియోగదారులపై అదనపు భారం మోపుతున్న వ్యాపారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పట్టణంలోని అన్ని బియ్యం దుకాణాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి తూకంలో మోసాలు, అధిక ధరల వసూళ్లు, నాణ్యతలో లోపాలు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.