BREAKING
thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి
Date of Publish : 06 October 2026, 08:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వరి పంటకు వరం.. ద్రవ జీవామృతం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Oct, 2026 - 08:53 PM
7 వీక్షణలు

విస్సన్నపేట: ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో రసాయన రహిత పంటల సాగుకు రైతులు ప్రాధాన్యం ఇస్తున్నారు. తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో ఆంధ్ర కేసరి రైతు ఉత్పత్తిదారుల సంఘానికి చెందిన కౌలు భూమిలో 100 శాతం రసాయన రహిత విధానంలో వరి సాగు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ద్రవ జీవామృతం తయారీ, వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు.

ద్రవ జీవామృతం తయారీకి ప్లాస్టిక్ డ్రం, 10 కిలోల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, రెండు కిలోల బెల్లం, రెండు కిలోల శనగపిండి, గుప్పెడు పుట్టమట్టి, 180 లీటర్ల నీటిని వినియోగిస్తారు. ముందుగా ఆవు పేడ, బెల్లం, శనగపిండి, పుట్టమట్టిని వేర్వేరు పాత్రల్లో తగినంత నీటితో ఉండలు లేకుండా కలిపి ద్రావణంగా తయారు చేస్తారు. అనంతరం వీటిని ఒకదాని తర్వాత ఒకటి డ్రమ్ములో పోసి, చివరిగా దేశీ ఆవు మూత్రాన్ని కలుపుతారు.

మిశ్రమాన్ని కర్రతో ఐదు నుంచి పది నిమిషాల పాటు సవ్యదిశలో బాగా కలిపి, డ్రమ్మును గోనె పట్టాతో కప్పి నీడలో ఉంచుతారు. అనంతరం ఏడు నుంచి ఎనిమిది రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కర్రతో సవ్యదిశలో కలుపుతారు. మిశ్రమం బంగారు రంగులోకి మారి, పండిన పండు వాసన వచ్చినప్పుడు ద్రవ జీవామృతం తయారైనట్లు గుర్తించవచ్చని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తెలిపారు.

తయారైన ద్రవ జీవామృతాన్ని ఏడు నుంచి పది రోజుల్లోపు ప్రధాన పంట పొలంలో పిచికారీ చేయడంతో పాటు నీటి తడితో పొలానికి అందించవచ్చని వివరించారు. ఇది నేలలోని సూక్ష్మజీవుల కార్యకలాపాలను పెంపొందించేందుకు ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే ఒక ఇన్‌పుట్‌గా పేర్కొన్నారు. సూక్ష్మజీవుల కార్యకలాపాలు చురుకుగా ఉండటం వల్ల నేలలోని పోషకాలు మొక్కలకు అందుబాటులోకి రావడంలో సహాయపడతాయని తెలిపారు. దీంతో నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వానపాముల వృద్ధికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌సీ యాంకర్ పర్సన్ కే. శివాజీ, సీఆర్‌పీలు పి. సత్యవతి, నాగరాణి, రాజశ్రీ, ఫార్మర్ మిత్ర రవితేజ, ప్రకృతి వ్యవసాయ శాఖకు చెందిన ఎఫ్‌ఎంటీ జి. శ్రీనివాసరావు, ఐసీఆర్‌పీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.