BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 07:40 pm
Posted by : కూనురు మధు

తీన్మార్ మల్లన్న పాదయాత్ర కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన లారీ.. ఇద్దరు మృతి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / మోత్కూరు
13 Nov, 2026 - 07:40 PM
16 వీక్షణలు

రెండు కార్లు ధ్వంసం.. రెండేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు.. కాలినడకన వెళ్తుండటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్న మల్లన్న

ఎన్‌టుడే న్యూస్‌ | యాదాద్రి భువనగిరి జిల్లా, నవంబర్ 13: తీన్మార్ మల్లన్న పాదయాత్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం సమీపంలోని గౌరెల్లి–కొత్తగూడెం ప్రధాన రహదారిపై శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పాదయాత్ర కాన్వాయ్‌లోని ఫార్చునర్ కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో ఆ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలు మేడబోయిన శ్రీనాథ్, చందన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వారి రెండేళ్ల కుమారుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.

వివరాల ప్రకారం.. తీన్మార్ మల్లన్న పాదయాత్ర మోత్కూరు నుంచి అనాజిపురం మీదుగా తిరుమలగిరి వైపు కొనసాగుతోంది. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ (టీఎస్ 30 టీ 7596) కాన్వాయ్‌లోని ఫార్చునర్ కారును (టీఎస్ 30 ఎల్ 444) ఢీకొట్టింది. లారీ ఢీకొట్టిన ధాటికి ఫార్చునర్ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాద తీవ్రతకు కార్లలో ఉన్నవారు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదంలో తిరుమలగిరికి చెందిన మేడబోయిన శ్రీనాథ్, ఆయన భార్య చందన, రెండేళ్ల కుమారుడితో పాటు డ్రైవర్ సురేష్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న శ్రీనాథ్, చందన మృతి చెందినట్లు సమాచారం. వారి చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో వైద్య చికిత్స అందిస్తున్నారు. మల్లన్నకు చెందిన ఫార్చునర్ కారులో ఉన్న మరో ఇద్దరు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

కాలినడకన వెళ్తుండటంతో తప్పిన ప్రమాదం

ప్రమాదం జరిగిన సమయంలో తీన్మార్ మల్లన్న కారులో కాకుండా కాలినడకన పాదయాత్ర కొనసాగిస్తుండటంతో ఆయన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని వాహనాలు ప్రమాదానికి గురికావడంతో పాదయాత్రలో కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వాహనాలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు పలువురు గాయపడటం ఆందోళన కలిగించింది.

ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాద తీరును పరిశీలించారు. ప్రమాదానికి గురైన వాహనాల వివరాలను సేకరించి, ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టారు. లారీ వేగం, వాహనాల కదలికలు, ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఇది సాధారణ రోడ్డు ప్రమాదమా లేదా మరేదైనా కారణం ఉందా అన్న అంశంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ కాలేదు. కుట్ర కోణానికి సంబంధించి కూడా అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే వివరాలపై స్పష్టత రానుంది.