BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 29 September 2026, 06:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మేడూరు అంగన్వాడీలో సేవా సంకల్ప్ అభియాన్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Sep, 2026 - 06:42 PM
10 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం మేడూరు గ్రామంలోని 93వ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ కె. నాగలక్ష్మి చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రత, విద్య, పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు.

ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని కార్యక్రమంలో ప్రదర్శించారు. పౌష్టికాహారంలో ఉండే వివిధ ఆహార పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి సమతుల్య ఆహారం ఎంతో అవసరమని తెలిపారు.

సీజన్‌లో చౌకగా, సులభంగా లభించే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించారు. పరిశుభ్రత పాటించడం, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను నివారించవచ్చని వివరించారు. చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు, అంగన్వాడీ సిబ్బంది టి. దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు.