BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 10:00 am
Posted by : VALLAPU KOTESH

దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యుడు మేకల రాములు యాదవ్‌కు ఘన సన్మానం

తెలంగాణ
/ నల్గొండ / నాంపల్లి
Reporter
Vallapu Kotesh Nampally Mandal
13 Nov, 2026 - 10:00 AM
52 వీక్షణలు

నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి నల్గొండ జిల్లా అధ్యక్షుడు నేతల ఆంజనేయులు యాదవ్

నల్గొండ: ఇటీవల దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యుడిగా నియమితులైన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్‌ను ఆ సమితి నల్గొండ జిల్లా అధ్యక్షుడు నేతల ఆంజనేయులు యాదవ్ గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో మేకల రాములు యాదవ్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నేతల ఆంజనేయులు యాదవ్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి కీలకమైన పదవి దక్కడం సంతోషకరమని పేర్కొన్నారు. మేకల రాములు యాదవ్‌కు దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యుడిగా అవకాశం లభించడం యాదవులందరికీ గర్వకారణమని అన్నారు. ఆయన నియామకం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల వెంకటేష్ యాదవ్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు సుదనబోయిన పర్వతాలు యాదవ్, నాంపల్లి మండల అధ్యక్షుడు జక్కుల రాజు యాదవ్, ఉపాధ్యక్షుడు కుందారపు సాయి యాదవ్, హస్తినాపురం ఓబీసీ యువమోర్చా అధ్యక్షుడు నరసింహ తదితరులు పాల్గొన్నారు.