BREAKING
thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
Date of Publish : 29 August 2026, 05:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 05:48 PM
50 వీక్షణలు

ప్రథమ సెమిస్టర్ విద్యార్థులకు ఉచిత తెలుగు అధ్యయన సామగ్రి పంపిణీ

ఖమ్మం జిల్లా మధిర:

తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో శనివారం తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవీంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు భాష గొప్పతనం, తెలుగు సాహిత్య వైభవం, భాష పరిరక్షణ ఆవశ్యకతపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలుగు భాషకు ఉన్న ప్రత్యేకత, సాహిత్య సంపదను వివరించారు. విద్యార్థులు తెలుగు భాషపై అభిమానం పెంపొందించుకొని, నిత్య జీవితంలో తెలుగును విస్తృతంగా ఉపయోగించాలని సూచించారు. భాష అభివృద్ధి, పరిరక్షణలో యువత పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రథమ సెమిస్టర్ విద్యార్థులకు తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన అధ్యయన సామగ్రిని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవీంద్రారెడ్డి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో తెలుగు భాష, సాహిత్యంపై మరింత ఆసక్తి పెరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జి. అరుణ, అధ్యాపకులు డాక్టర్ ఎస్. ఇందిర, డాక్టర్ పి. సుజాత, పి. లక్ష్మీనారాయణ, పి. శ్రీనివాస్, డాక్టర్ వి. నాగరాజు, డాక్టర్ ఎం.వి. శర్మ, ఎం.వి.ఎస్. శర్మ, ఎస్. జ్యోతి, ఎస్. పృథ్వీరాజ్, షేక్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.