మధిరలో విద్యార్థులకు డిక్షనరీలు, పెన్నుల పంపిణీ
మధిర: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సీపీఎస్ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డిక్షనరీలు, పెన్నులు పంపిణీ చేశారు. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా ఆశీస్సులతో వనమా ట్రస్టు ఆధ్వర్యంలో, దాతల సహకారంతో సుమారు 100 మంది విద్యార్థులకు ఇంగ్లిష్, హిందీ, తెలుగు డిక్షనరీలతో పాటు పెన్నులను అందజేశారు.
విద్యార్థుల్లో విద్యాభ్యాసంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, భాషా పరిజ్ఞానాన్ని మెరుగుపర్చేందుకు డిక్షనరీలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి దాతలు ముందుకు వచ్చి విద్యా సామగ్రిని అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు వనమా వేణుగోపాలరావు, ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు, ఎర్రుపాలెం మండల మాజీ అధ్యక్షులు వేములపల్లి ప్రసాద్, జల్ల రాధాకృష్ణమూర్తి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు విద్యా సామగ్రిని అందించిన వనమా ట్రస్టు నిర్వాహకులు, దాతలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.