BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 26 September 2026, 07:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మహాదేవపురం పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తుల బహుకరణ

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Sep, 2026 - 07:11 PM
13 వీక్షణలు

మధిర: మధిర మండలం మహాదేవపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠశాల విశ్రాంత గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పి.వి.ఎల్.డి. ప్రసాద్ తన సొంత ఖర్చులతో రూ.6 వేల విలువైన క్రీడా దుస్తులను అందజేశారు. శనివారం నుంచి మధిర మండలంలో ప్రారంభమైన మండలస్థాయి క్రీడా పోటీలకు విద్యార్థులు హాజరవుతున్న సందర్భంగా ఈ క్రీడా దుస్తులను ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు సిహెచ్. సాధు సమాధానం విద్యార్థులకు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, ఉద్యోగ విరమణ అనంతరం కూడా మహాదేవపురం పాఠశాల విద్యార్థుల పట్ల పి.వి.ఎల్.డి. ప్రసాద్ చూపిస్తున్న అభిమానాన్ని, సేవా భావాన్ని అభినందించారు. విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి సొంత ఖర్చులతో క్రీడా దుస్తులు అందజేసినందుకు ఆయనకు పాఠశాల ఉపాధ్యాయ బృందం కృతజ్ఞతలు తెలిపింది.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి. వెంకటేశ్వరరావు, తాళ్లూరి సుబ్బారావు, పోలె సుధాకర్, ఎం. కృష్ణవేణి, వి.ఎల్.పి. కుమారి, ఏ. వినోద్‌రావు, వి. రాములు, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కె. వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.