BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 05:44 pm
Posted by : K MAHESH

ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
13 Nov, 2026 - 05:44 PM
30 వీక్షణలు

నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో మహాసభలు.. నవంబర్ 15న లక్షలాది మంది రైతులతో భారీ ర్యాలీ, బహిరంగ సభ

రామన్నపేట: నల్లగొండలో నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు వనం ఉపేందర్ పిలుపునిచ్చారు. ఈ మహాసభల ప్రచారంలో భాగంగా రామన్నపేట మండలం అంబాయిగూడెం గ్రామంలో శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను విడుదల చేశారు.

ఈ సందర్భంగా వనం ఉపేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి చారిత్రక నేపథ్యం కలిగిన నల్లగొండ పట్టణంలో ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. నవంబర్ 15 నుంచి 18 వరకు జరిగే ఈ మహాసభలకు రైతులు, వ్యవసాయ కార్మికులు, పేదలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పద్ధతులను ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో నవంబర్ 14 నుంచి 18వ తేదీ వరకు 'అగ్రి షో' పేరుతో వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.

నవంబర్ 15న లక్షలాది మంది రైతులతో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు రైతులు, వ్యవసాయ కూలీలు, పేదలు వేలాదిగా తరలివచ్చి పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలని, రైతుల రుణ విమోచన కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, రైతులు పండించిన పంటలను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై రైతాంగం గొంతుకను వినిపించేందుకు జాతీయ మహాసభలు, బహిరంగ సభ వేదిక కానున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకుడు గంగాదేవి అంజయ్య, అంబాయిగూడెం గ్రామ కార్యదర్శి గంగాదేవి మల్లేశం, గంగాదేవి నరసింహ, గంగాదేవి కొండల్, శంకరయ్య, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.