BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 08 October 2026, 04:20 pm
Posted by : V శ్రీనివాస్

ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభతరం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
08 Oct, 2026 - 04:20 PM
13 వీక్షణలు

వాట్సాప్ ద్వారా నేరుగా ఫిర్యాదులు.. ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

మంచిర్యాల: ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో ప్రత్యేక వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. రాష్ట్ర ఆబ్కారీ, మద్యనిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

ప్రజలు తమ ఫిర్యాదులు, వినతులను నేరుగా వాట్సాప్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే వాట్సాప్ ద్వారా సంబంధిత అధికారులకు తమ సమస్యలను తెలియజేయవచ్చని వివరించారు. హైదరాబాద్‌లోని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పేషీలోనూ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించడంతో పాటు వాటి పరిష్కారంలో జాప్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

ప్రజలు తమ ఫిర్యాదులను జిల్లా ఇన్‌చార్జి మంత్రి పేషీ వాట్సాప్ నంబర్ 8500689596కు, మంచిర్యాల కలెక్టరేట్ వాట్సాప్ నంబర్ 9492123642కు మెసేజ్ రూపంలో పంపవచ్చని తెలిపారు. ఈ నంబర్లకు ఫోన్ కాల్స్ చేయకుండా కేవలం వాట్సాప్ ద్వారా మాత్రమే ఫిర్యాదులు పంపాలని సూచించారు.

ఫిర్యాదు పంపే సమయంలో సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, సమస్య ఉన్న ప్రదేశం, చిరునామా, అవసరమైన ఆధారాలు, సంబంధిత ఫొటోలను జత చేయాలని కలెక్టర్ తెలిపారు. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయడం ద్వారా సమస్యను గుర్తించి, సంబంధిత శాఖకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం సులభతరం అవుతుందని వివరించారు.

ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, సులభంగా అందించడంతో పాటు వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపడమే ప్రత్యేక గ్రీవెన్స్ సెల్‌ల ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.