చింతలపూడి కోర్టు వద్ద ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి కోర్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏపీ 39 జీఎక్స్ 3195 నంబర్ గల ట్రాక్టర్ మోటార్ సైకిల్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని జిలకరిగూడెం గ్రామానికి చెందిన పామర్తి సాయి, మోహనరావు కుమారుడిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన తీరుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.