మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మండల అధికారులు
మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మండల అధికారులు
యాదాద్రి జిల్లా: వలిగొండ: : అక్టోబర్ 28
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అధ్యక్షతన స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు పంచాయతీరాజ్ కమిషనర్ మేడమ్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనుల పురోగతి, కూలీల సమీకరణ, నీటి సంరక్షణ కార్యక్రమాలు మరియు ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులు, ఉపాధి హామీ పథకం బృంద సభ్యులు, గ్రామ పంచాయతీ సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు.
ఉపాధి హామీ పనులకు కూలీలను సమీకరించి, పనులను వేగవంతం చేయడం,ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, తగినంత నీరు తాగడం, వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండడం వంటి సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో వలిగొండ మండల పంచాయతీ అధికారి వై. ప్రేమలత, అసిస్టెంట్ ఇంజనీర్ (పంచాయతీరాజ్) జి. సందీప్ రెడ్డి , మండల వ్యవసాయ అధికారి అంజనీ దేవి , పశువైద్యాధికారి అనిల్ రెడ్డి, ఏఈఈ నాగరాజు, ఏపీవో పరశురాములు, ఈ సి విక్రమ్ , ఉపాధి హామీ పథకం బృంద సభ్యులు, గ్రామ పంచాయతీ సర్పంచులు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.