తౌషిక్, మౌలాబీ మరణాలపై న్యాయం కోరుతూ మహా ధర్నా!
ఆంధ్రప్రదేశ్
/
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
50 వేల మందితో భారీ నిరసనకు పిలుపునిచ్చిన మందకృష్ణ మాదిగ
సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ పాఠశాల విద్యార్థి సయ్యద్ తౌషిక్, అతని తల్లి మౌలాబీ మరణాలపై సీబీఐ విచారణతో పాటు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
తౌషిక్ మరణం ఆత్మహత్య కాదని, హత్యేనని ఆయన ఆరోపించారు. పాఠశాల యాజమాన్యం వాస్తవాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించిందని, ఈ ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అక్టోబర్ 12న ఒంగోలు కలెక్టరేట్ వద్ద 50 వేల మందితో మహా ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మార్కాపురం, గిద్దలూరు తదితర ప్రాంతాల్లో వివిధ ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు.
తౌషిక్, మౌలాబీ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొంటూ, కులమతాలు, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ధర్నాలో పాల్గొనాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.