ములుండ్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడు గ్యాస్ సిలిండర్లు పేలినట్లు సమాచారం
జాతీయం
జాతీయం
ముంబై: ములుండ్ ఈస్ట్‌లోని బీఎంసీ ప్రాజెక్ట్ అఫెక్టెడ్ పర్సన్స్ (పీఏపీ) పునరావాస కేంద్రంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కార్మికుల నివాసాల్లో మంటలు వేగంగా వ్యాపించడంతో ఏకంగా ఏడు గ్యాస్ సిలిండర్లు పేలినట్లు పోలీసులు తెలిపారు.
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ ఉన్న కార్మికులను సురక్షితంగా బయటకు తరలించి, మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలపై సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.