కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...!
ఆంధ్రప్రదేశ్
/
కర్నూలు
కర్నూలు జిల్లా: కౌతాళం మండలం మేలిగనూరు వద్ద తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
హోస్పేట డ్యామ్ నుండి 2,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని సమాచారం. ప్రస్తుతం మేలిగనూరు వద్ద 6,500 క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం నమోదవుతుందని అధికారులు తెలిపారు.
నదిలోకి నీరు రావడంతో తీరా ప్రాంతాల తాగునీటి ఎద్దడి తీరనుందని, రైతుల సాగునీటి కష్టాలు కూడా తీరుతుందని ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.