BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 12:51 pm
Posted by : K MAHESH

మతసామరస్యం, విద్యాభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే నాయిని

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 12:51 PM
51 వీక్షణలు

హనుమకొండ, నవంబర్ 11: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. విద్యారంగ అభివృద్ధితో పాటు దేశ ఐక్యత, మతసామరస్యం కోసం ఆయన చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

జాతీయ విద్యా దినోత్సవం, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం అనంతరం భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. విద్యను సమాజంలోని అన్ని వర్గాలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఆయన చేసిన ప్రయత్నాలు దేశ అభివృద్ధికి పునాది వేశాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆజాద్ దేశానికి సేవలందించారని, జాతీయ ఐక్యతను బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించారని నాయిని అన్నారు. మతసామరస్యం, సమానత్వం, సోదరభావం వంటి విలువలకు ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. భిన్న మతాలు, సంస్కృతులు కలిగిన ప్రజలు ఐక్యంగా జీవించాలనే ఆయన ఆలోచనలు నేటి సమాజానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, దేశం కోసం ఆయన చేసిన సేవలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఆయన జయంతిని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడంతో పాటు, విద్యాభివృద్ధి, మతసామరస్యం, సామాజిక ఐక్యతకు సంబంధించిన కార్యక్రమాలను ఆయన స్ఫూర్తితో చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, మైనారిటీ సెల్ చైర్మన్ బాబాభాయ్, మైనారిటీ నాయకులు ఇస్మాయిల్, అజీజ్ ఉల్లా, అబూబకర్, మాజీ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.