BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 03:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విద్యాభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Nov, 2026 - 03:07 PM
4 వీక్షణలు

జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వేడుకలు

మధిర, నవంబర్ 11: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ విద్యారంగ అభివృద్ధికి అందించిన సేవలు చిరస్మరణీయమని మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవీంద్రారెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికీ విద్య అందించాలనే లక్ష్యంతో ఆయన వేసిన పునాదులు దేశ విద్యావ్యవస్థ అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయని పేర్కొన్నారు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 11న ఖమ్మం జిల్లా మధిరలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆజాద్ చిత్రపటానికి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవీంద్రారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జి. అరుణ, అధ్యాపకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన విద్యారంగానికి చేసిన సేవలను స్మరించుకుంటూ విద్య ప్రాముఖ్యత, విద్యార్థుల బాధ్యతలపై మాట్లాడారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవీంద్రారెడ్డి మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ విద్యారంగానికి బలమైన పునాదులు వేశారని కొనియాడారు. విద్యావ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు విద్య ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఆయన చేసిన కృషి భారతదేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని తెలిపారు.

విద్య అనేది కేవలం ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే ఉపయోగపడే సాధనం కాదని, వ్యక్తిలో ఆలోచనా శక్తిని పెంపొందించి, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని వివరించారు. విద్య ద్వారా సమాజ అభివృద్ధి, దేశ పురోగతికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు అలవడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను కూడా అలవర్చుకోవాలని సూచించారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

వైస్ ప్రిన్సిపాల్ జి. అరుణ మాట్లాడుతూ.. విద్యారంగానికి విశేష ప్రాధాన్యతనిచ్చిన దార్శనికుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందించాలన్న ఆయన ఆశయాలు నేటి తరానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా మహిళా విద్య, ఉన్నత విద్యాభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, నిరంతర అధ్యయనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. చదువులో పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగుతూ తమ లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఎస్. ఇందిర, డాక్టర్ పి. సుజాత, డాక్టర్ వి. నాగరాజు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.