రామాపురం సభకు వచ్చే ప్రజలకు భోజన ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
కనిగిరి
వరికుంటపాడు: మండలంలోని రామాపురంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొనే బహిరంగ సభకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
సభకు తరలివచ్చే ప్రజల కోసం కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బల్లిపల్లి వద్ద భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజనం, ఇతర సౌకర్యాలపై దృష్టి సారించినట్లు నిర్వాహకులు తెలిపారు.
భోజన ఏర్పాట్లను టీడీపీ నాయకుడు కత్తులపల్లి వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ పోతు కొండారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.