BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 03:04 pm
Posted by : NUNE SRIKANTH

పేదలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు.. రైతులకు 50 శాతం రాయితీ

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
10 Nov, 2026 - 03:04 PM
22 వీక్షణలు

పెర్కిట్ ఎంజే ఆసుపత్రి అధిపతి డాక్టర్ మధుశేఖర్ ప్రకటన.. ప్రతి నెల ఇద్దరు మహిళలకు ఉచిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

ఆర్మూర్, నవంబర్ 10 (ఎన్ టుడే న్యూస్):

నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను తక్కువ ఖర్చుతో అందించాలనే ఉద్దేశంతో ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోని ఎంజే ఆసుపత్రి ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోందని ఆసుపత్రి అధిపతి డాక్టర్ మధుశేఖర్ తెలిపారు. రైతులకు వైద్య సేవల్లో 50 శాతం రాయితీ కల్పించడంతో పాటు పేదలకు తక్కువ ధరకు ఓపీ సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి నెల ఇద్దరు మహిళలకు ఉచితంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

రూ.300 ఓపీ ఫీజు రూ.100కే

సాధారణంగా రూ.300గా ఉన్న ఓపీ ఫీజును పేదల సౌకర్యార్థం ప్రస్తుతం రూ.100 మాత్రమే తీసుకుంటున్నట్లు డాక్టర్ మధుశేఖర్ తెలిపారు. అంతేకాకుండా అవసరమైన వైద్య పరీక్షలను కూడా ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రైతులకు వైద్య సేవల్లో 50 శాతం రాయితీ అందించనున్నట్లు వివరించారు.

ప్రతి నెల ఇద్దరు మహిళలకు ఉచిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగడం లేదని, ఈ నేపథ్యంలో పేద మహిళలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో తమ ఆసుపత్రిలో ప్రతి నెల ఇద్దరు మహిళలకు ఉచితంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ మధుశేఖర్ వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య సేవలు పొందలేని మహిళలకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.

30 ఏళ్లుగా పెర్కిట్‌లో వైద్య సేవలు

పెర్కిట్‌లో గత 30 సంవత్సరాలుగా ఎంజే ఆసుపత్రిని నిర్వహిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ మధుశేఖర్ పేర్కొన్నారు. పేదలు, రైతులకు వైద్య ఖర్చుల భారం తగ్గించేలా రాయితీలు, ఉచిత సేవలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.