BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 12:20 pm
Posted by : BOYA SWAMY

ఉరుమడ్ల గ్రామంలో మీ సేవ కేంద్రం ప్రారంభం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
11 Nov, 2026 - 12:20 PM
14 వీక్షణలు

ఉరుమడ్ల: గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ, ప్రైవేటు ఆన్‌లైన్ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఉరుమడ్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మీ సేవ కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం ముఖ్య అతిథిగా హాజరై కేంద్రాన్ని ప్రారంభించారు. మీ సేవ కేంద్రం నిర్వాహకురాలు సుంకరి జ్యోతికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ భానుశ్రీ భిక్షం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మారుమూల గ్రామాల్లోని ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. గ్రామంలో మీ సేవ కేంద్రం అందుబాటులోకి రావడం వల్ల వివిధ పనుల కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు.

గ్రామ ప్రజలు, రైతులు, విద్యార్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమకు అవసరమైన వివిధ ఆన్‌లైన్ సేవలను ఈ కేంద్రం ద్వారా పొందాలని కోరారు. ప్రభుత్వ సేవలు, ఇతర ఆన్‌లైన్ అవసరాల కోసం కేంద్రాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.

అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామ యువకులు, యువతులు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చిట్యాల చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, పాటి నర్సింహ రెడ్డి, వార్డు సభ్యులు ఎలిమినెటి హరి ప్రసాద్ రెడ్డి, అనంతుల శంకర్, నడిమిపల్లి గోపాల్, రూపని ఎల్లయ్య, రూపని యాదయ్య, గంగాపురం వెంకన్న, సుంకరి అశోక్, తాటికొండ సత్తయ్య, పాలకూరి నోములు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.