BREAKING
thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Date of Publish : 06 October 2026, 10:48 pm
Posted by : PARSIKA KAMESH

చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ పోలవరం
06 Oct, 2026 - 10:48 PM
9 వీక్షణలు

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: లక్ష్మణ్ రాజు

చింతూరు: పోలవరం జిల్లా చింతూరు మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు బట్ట లక్ష్మణ్ రాజు ఆధ్వర్యంలో మండల పదాధికారులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ రాజు మాట్లాడుతూ పార్టీ సంస్థాగత అంశాలపై పదాధికారులు, కార్యకర్తలతో చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

ప్రజలకు పార్టీ కార్యకర్తలు మరింత చేరువై వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.

సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు కుర్సం సుబ్బారావు, మండల ఉపాధ్యక్షుడు పైదా సుబ్బయ్య, మండల కోశాధికారి అప్పున జీవాజీ గణేష్, ప్రధాన కార్యదర్శి పైదా మనోజ్, కార్యదర్శి పల్లాల రాజిరెడ్డి, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు పర్శక కామరాజు, యువ మోర్చా అధ్యక్షుడు పైదా సురేష్‌తో పాటు గంగారాజు, నరేష్, మరయ్య, శివ, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

సమావేశం వివరాలను బీజేపీ చింతూరు మండల అధ్యక్షుడు బట్ట లక్ష్మణ్ రాజు వెల్లడించారు.