పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియపై సమావేశం
తెలంగాణ
/
వరంగల్
/
వరంగల్
వరంగల్: సోమవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో పట్టభద్రుల నమోదు ప్రక్రియపై సమావేశం నిర్వహించారు.
జిల్లా అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ, అర్హత కలిగిన పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునే విధానం తదితర అంశాలపై చర్చించారు.
ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధుల సూచనలు, అభిప్రాయాలను అధికారులు తెలుసుకున్నారు. అర్హత కలిగిన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు అయ్యేలా అవగాహన కల్పించాల్సిన అవసరంపై సమావేశంలో చర్చించారు.