BREAKING
thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక
Date of Publish : 06 October 2026, 07:25 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అక్టోబర్ 7న మెగా వైద్య శిబిరం

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
06 Oct, 2026 - 07:25 PM
2 వీక్షణలు

కందుకూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌–2026’లో భాగంగా కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఇంద్రాణి తెలిపారు.

అక్టోబర్‌ 7న బుధవారం ఉదయం 9 గంటలకు కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మెగా వైద్య శిబిరం ప్రారంభం కానుంది. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

శిబిరంలో కందుకూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్యుల సలహాలు, ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డాక్టర్‌ ఇంద్రాణి తెలిపారు. ఎక్స్‌రే, ఈసీజీ, స్కానింగ్‌తో పాటు వివిధ రకాల రక్త పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

వ్యాధులను ముందస్తుగా గుర్తించడంతో పాటు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ఇలాంటి వైద్య శిబిరాలు ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్య శిబిరానికి హాజరై వైద్యుల సలహాలు పొందాలని డాక్టర్‌ ఇంద్రాణి కోరారు.