BREAKING
thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక
Date of Publish : 06 October 2026, 07:22 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

నర్సింగోలులో హెలిప్యాడ్‌, ప్రజా వేదిక, పార్టీ క్యాడర్‌ సమావేశ స్థలాల పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
06 Oct, 2026 - 07:22 PM
6 వీక్షణలు

చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై పరిశీలన

కొండపి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న కొండపి నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. జరుగుమల్లి మండలం నర్సింగోలులో ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్‌, ప్రజా వేదిక, పార్టీ క్యాడర్‌ సమావేశ స్థలాలను మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, జిల్లా కలెక్టర్‌ పి. రాజాబాబు, రాష్ట్ర మారిటైమ్‌ బోర్డు చైర్మన్‌, జోనల్‌ కో-ఆర్డినేటర్‌ దామచర్ల సత్య కలిసి పరిశీలించారు.

ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. హెలిప్యాడ్‌, ప్రజా వేదిక, సమావేశ ప్రాంగణాల్లో అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు.

పర్యటనను సజావుగా నిర్వహించేందుకు శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు, పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.