BREAKING
thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb చిట్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb చిట్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Date of Publish : 23 September 2026, 10:25 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
23 Sep, 2026 - 10:25 PM
10 వీక్షణలు

విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని సితార గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన 72 అడుగుల డూండి గణేశుని మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఆయనతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సితార గ్రౌండ్స్‌కు చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు ఎంపీ కేశినేని శివనాథ్ స్వాగతం పలికారు. అనంతరం 72 అడుగుల భారీ గణేశుని విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.

గణేశుని దర్శనం అనంతరం మంత్రి నారా లోకేష్, ఎంపీ కేశినేని శివనాథ్ భక్తులను పలకరిస్తూ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. సితార గ్రౌండ్స్‌లో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వినాయక చవితి వేడుకలను వీక్షించారు.

ఈ సందర్భంగా విజయవాడ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు మంత్రి నారా లోకేష్, ఎంపీ కేశినేని శివనాథ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేశుని సన్నిధిలో విజయవాడ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.