అరుదైన వ్యాధితో బాధపడుతున్న రిషితను పరామర్శించిన మంత్రి సీతక్క
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
హనుమకొండ: అరుదైన వ్యాధితో బాధపడుతున్న హనుమకొండ రెడ్డి కాలనీకి చెందిన రిషితను మంత్రి సీతక్క పరామర్శించారు. రిషితను కలవాలన్న కోరికను తెలుసుకున్న మంత్రి ఆమె ఇంటికి వెళ్లి స్వయంగా పరామర్శించారు.
ఈ సందర్భంగా రిషిత ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం అందుతున్న వైద్య సేవలు, కుటుంబ పరిస్థితుల గురించి మంత్రి సీతక్క అడిగి తెలుసుకున్నారు. రిషితతో కొద్దిసేపు మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పారు.
తనను కలవాలన్న రిషిత కోరికను నెరవేర్చడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. రిషిత ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ, ఆమె కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారికి ధైర్యం కల్పించారు.
మంత్రి సీతక్క తమ ఇంటికి వచ్చి రిషితను పరామర్శించడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.