నూజివీడులో జర్నలిస్టుల దాడిపై మంత్రి సీరియస్
నూజివీడులో శుక్రవారం రాత్రి జర్నలిస్టులపై జరిగిన దాడి ఘటనపై సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. విజయవాడ, పెనమలూరు నియోజకవర్గాలకు చెందిన జర్నలిస్టులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసి ఘటన వివరాలను వివరించారు.
విషయాన్ని తెలుసుకున్న మంత్రి పార్థసారథి వెంటనే నూజివీడు డీఎస్పీకి ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జర్నలిస్టులపై దాడికి పాల్పడిన నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులను ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి స్పష్టం చేశారు. జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మంత్రి ఆదేశాల నేపథ్యంలో నూజివీడు జర్నలిస్టులపై దాడి ఘటనలో పోలీసుల తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.