పాకిస్తాన్‌లో మంత్రి అదుపులోకి పెషావర్‌లో కలకలం
అంతర్జాతీయం
అంతర్జాతీయం
పాకిస్తాన్‌లో మంత్రి అదుపులోకి! పెషావర్‌లో కలకలం!!!
ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా మంత్రి ఫజల్ షకూర్ ఖాన్‌ను సోమవారం పెషావర్‌లో ముసుగులు ధరించిన గుర్తుతెలియని సాయుధ వ్యక్తులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వైరల్ అవుతున్న దృశ్యాల్లో సాయుధ వ్యక్తులు ఆయన వాహనాన్ని అడ్డుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే, వారెవరు, ఏ సంస్థకు చెందినవారన్నది ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.
ఈ ఘటనను KP అసెంబ్లీ తీవ్రంగా పరిగణించింది FIR నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలని అధికారులు పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు, PTI నేతలు అరెస్టులు, నిర్బంధాలను ఎదుర్కొంటున్న సమయంలోనే.. సెప్టెంబర్ 27న PTI ప్రకటించిన ఇస్లామాబాద్ మార్చ్‌కు కొద్ది రోజుల ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం రాజకీయంగా కలకలం రేపుతోంది.