BREAKING
thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ thumb ● మునగపాకలో పెన్షన్ల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ thumb ● మునగపాకలో పెన్షన్ల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు
Date of Publish : 02 October 2026, 12:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వెంకటాపురంలో యూసీజీ అవగాహన సదస్సులో స్వల్ప ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Oct, 2026 - 12:28 PM
16 వీక్షణలు

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం వెంకటాపురం గ్రామంలో యూసీజీ (UCG) అంశంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. సబ్‌ కలెక్టర్ వినూత్న, రెవెన్యూ అధికారులు, రిలయన్స్ సంస్థ సిబ్బంది సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

గ్రామసభ నిర్వహించకుండా అవగాహన సదస్సు ఎలా నిర్వహిస్తారని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. ముందుగా గ్రామసభ నిర్వహించాలని, యూసీజీపై తమకున్న సందేహాలను నివృత్తి చేయాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేశారు. గ్రామసభ నిర్వహించకపోతే సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోతామని పలువురు గ్రామస్తులు పేర్కొన్నారు.

దీంతో స్పందించిన ఎమ్మార్వో గ్రామసభ నిర్వహిద్దామని, సమావేశంలో కూర్చోవాలని గ్రామస్తులను కోరినట్లు తెలిసింది. ప్రజల్లో యూసీజీ అంశంపై అనవసరమైన అపోహలు ప్రచారంలో ఉన్నాయని, వాటిని తొలగించి వాస్తవాలను వివరించడమే సమావేశం ఉద్దేశమని సబ్‌ కలెక్టర్ వినూత్న తెలిపారు.

అయితే యూసీజీపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గ్రామ పెద్దలు స్పష్టం చేశారు. అధికారులు పలుమార్లు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ గ్రామస్తులు తమ అభ్యంతరాలను కొనసాగించారు. ఈ క్రమంలో సమావేశం మధ్యలోనే సబ్‌ కలెక్టర్ వినూత్న, ఎమ్మార్వో, రిలయన్స్ సంస్థ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో వెంకటాపురంలో యూసీజీ అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సు మధ్యలోనే ముగిసింది.