సేవా మేరా యోగదాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
పెదకూరపాడు, అక్టోబరు 2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా ‘సేవా మేరా యోగదాన్’ కార్యక్రమాన్ని పెదకూరపాడు నియోజకవర్గంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని మొక్కలు నాటారు. ప్రజాసేవ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతకు సంబంధించిన కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ‘సేవా మేరా యోగదాన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ జానీ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెన్నా సాంబశివరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో సేవా కార్యక్రమాలు, శ్రమదానం, ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలు తదితరాలను నిర్వహిస్తున్నట్లు అధికారిక సమాచారం పేర్కొంది.