BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 04:17 pm
Posted by : PAGADALA DEVAIAH

గురుకుల హాస్టల్‌లో సమస్యలపై ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆరా

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
10 Nov, 2026 - 04:17 PM
21 వీక్షణలు

ఆకస్మిక తనిఖీలో నీటి కొరత, మరుగుదొడ్ల నిర్వహణపై అసంతృప్తి.. వెంటనే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం

ఎల్బీనగర్, నవంబర్ 10 (ఎన్ టుడే న్యూస్):

గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని జోనల్ కమిషనర్ కార్యాలయం వెనుక ఉన్న గురుకుల హాస్టల్‌ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లో విద్యార్థులకు అందుతున్న వసతి సౌకర్యాలు, భోజన నాణ్యత, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

తనిఖీ సందర్భంగా హాస్టల్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు ఎమ్మెల్యే గుర్తించారు. విద్యార్థులు తమ అవసరాల కోసం నీటిని మూడు, నాలుగు అంతస్తులకు సైతం స్వయంగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని తెలుసుకున్నారు. విద్యార్థులకు నిరంతరంగా తాగునీరు, ఇతర అవసరాలకు సరిపడా నీరు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదేవిధంగా హాస్టల్‌లో మొత్తం 60 మూత్రశాలలు ఉండగా, వాటిలో కేవలం 8 మాత్రమే వినియోగంలో ఉన్నాయని తెలుసుకుని అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన మూత్రశాలలు ఎందుకు వినియోగంలో లేవనే విషయంపై ఆరా తీశారు. వాటికి అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టి విద్యార్థులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు, పౌష్టికాహారం, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని సూచించారు. హాస్టల్‌లో గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించి, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, రమేష్ ముదిరాజ్, బిచినేపల్లి వెంకటేశ్వరరావు, శ్రీశైలం యాదవ్, రమణారెడ్డి, గండి సన్నియాదవ్, కొత్త రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.