మంత్రి వాకిటి శ్రీహరికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య, క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు మంత్రికి శాలువా కప్పి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విషయాలపై నాయకులు పరస్పరం చర్చించినట్లు తెలిపారు. మంత్రి పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల జిల్లా ఓబీసీ చైర్మన్ వొడ్డే రాజమౌళి పాల్గొన్నారు.
కార్పొరేటర్లు మాద్దంశెట్టి సత్యనారాయణ, హరికృష్ణ, చింతపండు శ్రీనివాస్, తాళ్ల సంపత్ రెడ్డి, కాకుల వరలక్ష్మీ-యువరాజ్, మంచిర్యాల పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జలీల్, నాయకులు ఆది సంజీవ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.