BREAKING
thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది
Date of Publish : 06 October 2026, 04:17 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
06 Oct, 2026 - 04:17 PM
10 వీక్షణలు

పెండింగ్‌ పనులను ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పూర్తి చేయాలి

విజయవాడ, అక్టోబర్ 6 (ఎన్ టుడే న్యూస్): విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష నిర్వహించారు. భవానీపురంలోని ఎన్డీయే కార్యాలయంలో వీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో నిలిచిపోయిన, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల వివరాలను ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా పనులను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి, ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రధానంగా కాళేశ్వరరావు మార్కెట్, వస్త్రలత కాంప్లెక్స్‌ల రీడెవలప్‌మెంట్, కొండ ప్రాంతాల ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించడం, స్మశానవాటికలు, పార్కుల అభివృద్ధి, రివర్‌ఫ్రంట్ బ్యూటిఫికేషన్ పనులపై సమీక్షించారు.

అలాగే నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న స్ట్రామ్‌వాటర్ డ్రైన్ల (వరద నీటి కాలువల) నిర్మాణ పనుల పురోగతిని కూడా పరిశీలించారు. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రభుత్వ గ్రాంట్లు, వాటి మంజూరు, వినియోగం తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పనులను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని, ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి అధికారులకు సూచించారు.

సమీక్షా సమావేశంలో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ స్పెషల్ ఆఫీసర్ ఎం. మధు, చీఫ్ ఇంజనీర్ సత్యకుమారి, ఎస్‌ఈ చంద్రశేఖర్, ఈఈ శ్రీనివాస్, డీఈలు పురుషోత్తం, కరుణాకర్‌తో పాటు నియోజకవర్గ స్పెషల్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.