సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యేలు
ఉదయగిరి, సెప్టెంబర్ 23: పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 29న నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం రామాపురంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బుధవారం రామాపురంలో పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం తదితర ప్రాంతాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
పర్యటనకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకలు, భద్రత తదితర ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని పేర్కొన్నారు.