BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 06:13 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులదే నైతిక విజయం: డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
07 Nov, 2026 - 06:13 PM
37 వీక్షణలు

కనిగిరి (ఎన్ టుడే న్యూస్):

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఒత్తిళ్లు, బెదిరింపులు, అక్రమాలను ఎదుర్కొని పోరాడిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులదే నైతిక విజయమని కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. రెండున్నరేళ్ల కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఎన్నికలు సజావుగా జరిగితే తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేవారని ఆయన అభిప్రాయపడ్డారు.

శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి నేతలు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు కలిసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఒత్తిళ్లు, బెదిరింపులు, మద్యం పంపిణీ, ఓటుకు నోటు వంటి ప్రలోభాలతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అక్రమాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. ఈ ఎన్నికలు వైఎస్సార్‌సీపీకి, పోలీసులకు మధ్య జరిగినట్లుగా ఉన్నాయని వ్యాఖ్యానిస్తూ, పోలీసుల తీరుపై విమర్శలు చేశారు.

2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉందని నారాయణ యాదవ్ పేర్కొన్నారు. అయితే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తమ పార్టీ అభ్యర్థులు ప్రస్తుత ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేశారని తెలిపారు. అధికార కూటమి నుంచి ఎదురైన ఒత్తిళ్లు, బెదిరింపులు, దౌర్జన్యాలను ఎదుర్కొంటూ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో నిలబడ్డాయని అన్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఎదురైన పరిస్థితులను ఎదుర్కొంటూ, అక్రమాలను ప్రశ్నిస్తూ కార్యకర్తలు చేసిన పోరాటం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందన్నారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు వెనకడుగు వేయలేదని పేర్కొన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నికల్లో ఎదురైన పరిస్థితుల మధ్య కూడా తనకు ఓటు వేసిన ఓటర్లకు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని నారాయణ యాదవ్ అన్నారు. క్షేత్రస్థాయిలో అడ్డంకులను ఎదుర్కొని నిలబడటమే తమకు నైతిక విజయమని ఆయన పేర్కొన్నారు.