BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 11:29 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అలిపిరి కాలిబాట మార్గంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు.. టీటీడీ కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Nov, 2026 - 11:29 AM
39 వీక్షణలు

తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుపతి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకునే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ చర్యలు వేగవంతం చేస్తోంది. అలిపిరి కాలిబాట మార్గంలో భక్తులకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు, ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి గురువారం అలిపిరి నడక మార్గంలో సమగ్ర తనిఖీలు నిర్వహించారు. తిరుపతిలోని మాధవ నిలయం పీఏసీ-2 నుంచి జీఎన్‌సీ టోల్‌గేట్ వరకు కాలినడక మార్గంలో పర్యటించిన ఆయన, భక్తులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నడక మార్గంలో ఉచిత వసతి సముదాయాల వివరాలు, శ్రీవారి దర్శన సమయాలకు సంబంధించిన సమాచారం భక్తులకు సులభంగా తెలిసేలా స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే మార్గమధ్యంలోని దుకాణాలను పరిశీలించి తాగునీరు, ఆహార పదార్థాల విక్రయ ధరలపై ఆరా తీశారు. టీటీడీ నిర్ణయించిన ధరలకే వస్తువులను విక్రయించాలని వ్యాపారులకు స్పష్టం చేశారు. నిర్ణీత ధరల కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని అధిక ధరలకు విక్రయాలు జరపడం సహించబోమని స్పష్టం చేశారు. మరోవైపు అలిపిరి పాదచారుల మార్గంలో రద్దీకి అనుగుణంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. నడక మార్గంలో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, విద్యుత్ దీపాలు, విశ్రాంతి ప్రదేశాల్లో అవసరమైన ఏర్పాట్లను మెరుగుపరచాలని ఆదేశించారు. ముఖ్యంగా పండుగలు, సెలవు రోజుల్లో పెద్ద సంఖ్యలో తరలివచ్చే కాలినడక భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. కాలినడకన వచ్చే భక్తులకు అందించే సేవల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని, అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది భక్తులకు అందుబాటులో ఉంటూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. తిరుమలకు కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అలిపిరి మార్గంతో పాటు శ్రీవారి మెట్టు మార్గంలోనూ సౌకర్యాల విస్తరణకు టీటీడీ ప్రాధాన్యత ఇస్తోంది. భక్తులకు మెరుగైన వసతులు, స్పష్టమైన సమాచారం, నిర్ణీత ధరలకు వస్తువుల విక్రయం అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది.