BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 08:34 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నాయుడుపేట అభివృద్ధికి కలెక్టర్‌ నుంచి సర్పంచిగా మారిన మునిరత్నం.. నేటి సర్పంచులకు ఆదర్శం!

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 08:34 AM
25 వీక్షణలు

పదవీ విరమణ తర్వాత స్వగ్రామ సేవకు అంకితం.. పేదలకు వందకుపైగా ఇళ్లు.. ఆయన పేరుతోనే మునిరత్నం నగర్‌ సొంత ఊరిపై మమకారం పదవులు, హోదాలతో పోయేది కాదు. ఎంతటి ఉన్నత స్థానానికి ఎదిగినా పుట్టిపెరిగిన ఊరికి ఏదైనా చేయాలనే తపన కొందరిలో జీవితాంతం ఉంటుంది. అలాంటి అరుదైన వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం తాళ్వాయిపాటి మునిరత్నం. ఒకప్పుడు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆయన, పదవీ విరమణ అనంతరం తన స్వగ్రామ అభివృద్ధి కోసం సర్పంచిగా బాధ్యతలు చేపట్టి ప్రజాసేవకు కొత్త నిర్వచనం చెప్పారు. ఉన్నతాధికారిగా పనిచేసిన అనుభవాన్ని గ్రామాభివృద్ధికి ఉపయోగించి, పేదల సంక్షేమానికి బాటలు వేశారు. ప్రస్తుతం ఆయన చేసిన సేవలు నేటి గ్రామ సర్పంచులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన తాళ్వాయిపాటి మునిరత్నం గతంలో చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా, ఉమ్మడి నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా, అనంతరం కర్నూలు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. తన ఉద్యోగ జీవితంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారు. ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని వాటి పరిష్కారానికి తనవంతు ప్రయత్నం చేశారు. అధికారిగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ సొంత గ్రామంపై ఆయనకున్న అభిమానం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. పదవీ విరమణ అనంతరం నాయుడుపేట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. అప్పట్లో గ్రామ పంచాయతీగా ఉన్న నాయుడుపేటలో సుమారు రెండున్నర సంవత్సరాల పాటు సర్పంచిగా బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్‌గా పనిచేసిన వ్యక్తి గ్రామ సర్పంచిగా మారడం అప్పట్లో ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. అయితే ఆయనకు పదవి కంటే గ్రామానికి సేవ చేయాలనే సంకల్పమే ముఖ్యమైంది. గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కార్యాచరణ చేపట్టారు. అనంతరం తన బాధ్యతలకు రాజీనామా చేశారు. సర్పంచిగా పనిచేసిన సమయంలో గ్రామ పంచాయతీకి పక్కా భవనాన్ని నిర్మించడంతో పాటు, గ్రామానికి సమీపంలో సుమారు పది ఎకరాల భూమిని సేకరించి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, గృహాల నిర్మాణానికి చొరవ చూపించారు. వందకుపైగా పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరేలా కృషి చేశారు. ఆ ప్రాంతంలో ఏర్పడిన నివాస కాలనీకి ప్రస్తుతం మునిరత్నం నగర్‌గా పేరు పెట్టడం ఆయన సేవలకు గుర్తుగా నిలుస్తోంది. అంతటితో ఆగకుండా గ్రామ పంచాయతీకి శాశ్వత ఆదాయ వనరులు సమకూర్చాలనే ఆలోచనతో పట్టణంలోని ఖాళీ స్థలాలను వినియోగించి ఎన్.జే.ఆర్., ఎస్వీ వాణిజ్య సముదాయాల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. వీటి ద్వారా పంచాయతీకి ఆదాయం సమకూరేలా ప్రణాళిక రూపొందించారు. గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులతో పాటు, భవిష్యత్తులోనూ పంచాయతీ ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఆదాయ మార్గాలను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టారు. సాధారణంగా ఉన్నత పదవుల్లో పనిచేసిన వారు పదవీ విరమణ తర్వాత విశ్రాంతి జీవితాన్ని గడపాలని భావిస్తారు. కానీ మునిరత్నం మాత్రం తన అనుభవాన్ని, సమయాన్ని సొంత గ్రామ ప్రజల కోసం వెచ్చించారు. అధికార హోదాలో ఉన్నప్పుడు చేసిన సేవలకు భిన్నంగా, ప్రజల మధ్య ఉంటూ నేరుగా గ్రామాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. ఆయన భౌతికంగా ప్రజలకు దూరమైనప్పటికీ నిర్మించిన ఇళ్లు, ఏర్పాటు చేసిన సదుపాయాలు, పంచాయతీకి సమకూర్చిన ఆదాయ వనరులు ఆయన సేవలను గుర్తుచేస్తూనే ఉన్నాయి. పదవులు అలంకారాలు మాత్రమేనని, ప్రజలకు ఉపయోగపడే పనులే చిరస్థాయిగా నిలుస్తాయని మునిరత్నం జీవితం చాటిచెబుతోంది. నేటి గ్రామ సర్పంచులు కూడా గ్రామాభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి, ప్రజలకు మేలు చేసే పనులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన సేవలు గుర్తుచేస్తున్నాయి.