BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 06:48 pm
Posted by : కూనురు మధు

ఉపాధి హామీ పనులను అకస్మాత్తుగా తనిఖీ చేసిన నల్గొండ డి. ఆర్. డి .ఓ పిడి హరీష్ కుమార్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
13 Nov, 2026 - 06:48 PM
187 వీక్షణలు

కూలీలకు కొలతల ప్రకారం రూ.308 వేతనం అందేలా చూడాలని ఆదేశం..

NTODAY NEWS : చిట్యాల, 

ఉపాధి హామీ పనులను నాణ్యతతో  చేపట్టాలని నల్గొండ డి ఆర్ డి ఓ అడిషనల్ పీడీ హరీష్ కుమార్ అన్నారు . శుక్రవారం  చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో జరుగుతున్న విబీజీ రాంజీ పనులను  వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బోడగుట్ట వద్ద చేపడుతున్న కందకాల పనులను పరిశీలించి, పనుల నిర్వహణపై కూలీలకు, మేట్లకు పలు సూచనలు చేశారు. కూలీల హాజరును ఉదయం 8 గంటలలోపే నమోదు చేయాలని, కూలీలు నిర్ణీత సమయానికి పనులకు హాజరై నిర్దేశించిన కొలతల ప్రకారం పనులు పూర్తి చేయాలని సూచించారు. కూలీలకు కొలతల ఆధారంగా రోజుకు రూ.308 వేతనం అందేలా పనుల కొలతలు నమోదు చేయాలని మేట్లకు ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు. అలాగే జలసిరి పథకం పనులపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి చిన్న, సన్నకారు రైతు తమ వ్యవసాయ భూముల్లో నీటి కుంటలు, నీటి నిల్వ నిర్మాణ పనులు చేపట్టేలా ప్రోత్సహించాలని కోరారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు చేసేలా సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామంలో నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఉపాధి పనులకు రావడానికి ఆసక్తి చూపే ప్రతి కూలీకి పని కల్పించాలని, ముఖ్యంగా డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులు సైతం ఉపాధి పనులకు వస్తే వారికి పని కల్పించేలా చూడాలని సూచించారు. గ్రామంలో కూలీల సంఖ్య పెరిగేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ ఏపీడీ మహేందర్ రెడ్డి, ఎంపీడీవో జెల్ల పాండు, ఎంపీవో కోటేశ్వరరావు, సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, ఫీల్డ్ అసిస్టెంట్ మర్రి రమేష్, మేట్లు జనపాల మల్లిక, రూపని వనజ, రాసమల్ల సంధ్య, రాసమల్ల అజంతా, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.