BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 03:41 pm
Posted by : SEETHA KIRAN KUMAR

బావిలో పడిన వ్యక్తిని సురక్షితంగా కాపాడిన నల్గొండ పోలీసులు

తెలంగాణ
/ నల్గొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
22 Nov, 2026 - 03:41 PM
24 వీక్షణలు

తక్షణమే స్పందించి రెస్క్యూ ఆపరేషన్.. పోలీసుల సేవాభావాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ

నల్గొండ: ప్రమాదవశాత్తు బావిలో పడిన వ్యక్తిని నల్గొండ టూ టౌన్ పోలీసులు సాహసోపేతంగా రక్షించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. నల్గొండలోని సతీష్ నగర్‌లో తన నివాసం వద్ద ప్రమాదవశాత్తు బావిలో పడిన 38 ఏళ్ల రసమల్ల రంజిత్ కుమార్‌ను పోలీసులు సురక్షితంగా బయటకు తీశారు.

సమాచారం అందుకున్న వెంటనే టూ టౌన్ ఎస్సై సైదా బాబు పోలీసు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అంచనా వేసి, తాడు సహాయంతో సమన్వయంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పోలీసు సిబ్బంది సమయస్ఫూర్తి, సాహసంతో బావిలో చిక్కుకున్న రంజిత్ కుమార్‌ను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.

పోలీసుల తక్షణ స్పందన, బాధ్యతాయుత సేవాభావాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో చొరవ చూపిన ఎస్సై సైదా బాబుతో పాటు పోలీసు సిబ్బంది ఎంఏ ఫరూక్, బాలకోటి స్వామిని ప్రశంసించారు.

ఆపదలో ఉన్నవారికి సత్వర సహాయం అందిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం పోలీసుల బాధ్యతకు నిదర్శనమని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.