BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 04:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెం గ్రంథాలయంలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Nov, 2026 - 04:00 PM
36 వీక్షణలు

 పుస్తక పఠనంతోనే విజ్ఞానం.. నాయకత్వ లక్షణాల అభివృద్ధి – విద్యార్థులకు ఉపాధ్యాయుల దిశానిర్దేశం 49 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతుల ప్రదానం ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం శాఖా గ్రంథాలయంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు విజ్ఞానాన్ని విస్తరించుకోవడం, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ముందుగా విశ్రాంత ఉపాధ్యాయులు ఎస్. మల్లికార్జునరావు ‘Read to Learn, Learn to Lead’ (నేర్చుకోవడానికి చదవండి.. నాయకత్వం వహించడానికి నేర్చుకోండి) అనే అంశంపై విద్యార్థులకు వివరించారు. పుస్తక పఠనం ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవడమే కాకుండా ఆలోచనా శక్తి, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవచ్చని సూచించారు. ఎంపీపీ మెయిన్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జానకి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో విద్యార్థులు సెల్‌ఫోన్ల వినియోగానికి అధిక సమయం కేటాయిస్తున్నారని, ఆ అలవాటును తగ్గించుకొని పుస్తక పఠనానికి ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయురాలు యశోద మాట్లాడుతూ బయట సులభంగా లభించని ఎన్నో విలువైన పుస్తకాలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంటాయని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సామాజిక శాస్త్ర ఉపాధ్యాయురాలు స్వప్న మాట్లాడుతూ ప్రతిరోజూ కనీసం గంటసేపైనా గ్రంథాలయంలో గడపడం, దినపత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. చిన్న వయసు నుంచే పఠనాన్ని జీవితంలో భాగంగా చేసుకుంటే భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం సుగమమవుతుందని పేర్కొన్నారు. అనంతరం వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 49 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ బహుమతులను రామిశెట్టి పిచ్చయ్య, ఆయన ధర్మపత్ని కృష్ణకుమారి జ్ఞాపకార్థం అందజేసినట్లు గ్రంథాలయ అధికారిణి వి. జ్యోతిర్మయి తెలిపారు. విద్యార్థుల్లో పుస్తక పఠనాసక్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.