వెల్గటూర్ మండలంలో నూతన జై హనుమాన్ డీజిల్ ఆటో యూనియన్ ప్రారంభం
వెల్గటూర్ మండలంలో 'నూతన జై హనుమాన్ డీజిల్ ఆటో యూనియన్' ఘనంగా ఏర్పాటు
వెల్గటూర్, సెప్టెంబర్ 29 ఎన్ టుడే న్యూస్
వెల్గటూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఈరోజు "నూతన జై హనుమాన్ డీజిల్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్"ను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. మాజీ సర్పంచ్ బండమీది ముత్తయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ బండమీది కవితా గోపి, మార్కెట్ కమిటీ చైర్మన్ గోళ్ల తిరుపతి, ఉప సర్పంచ్ గండ్ర ప్రతాప్ రావు, మెరుగు నరేష్ గౌడ్, మాజీ సర్పంచ్ మెరుగు మురళి, మూగల సతీష్, బందెల ఉదయ్, భూసర్తి గంగారం తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆటో ఓనర్లు, డ్రైవర్ల సమక్షంలో యూనియన్ నూతన మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గ వివరాలు:
గౌరవ అధ్యక్షులు: హనుమాన్ల నారాయణ
అధ్యక్షులు: సంఘ రాజమౌళి (ముత్తునూరు)
ప్రధాన కార్యదర్శి: కుశనపల్లి దుర్గయ్య (రాంనూర్)
ఉపాధ్యక్షులు: నక్క ప్రసాద్, జగడం కోటి
జాయింట్ సెక్రటరీలు: మాదాసు అశోక్, మీరల రమేష్, బిడారి శ్రీనివాస్
కోశాధికారి & కార్యవర్గ సభ్యులు: కుశనపల్లి నరసయ్య, సల్లూరి లచ్చయ్య, సైదం తిరుపతి, కర్ణమామిడి శ్రీనివాస్, గాజుల సత్తయ్య, గుమ్ముల రాజయ్య, అంకం సురేష్, బండమీది శేఖర్, కుశనపల్లి తిరుపతి.
ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు ఆటో యజమానులు, డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.