ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె 14వ రోజుకు..
- ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి: జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డా. భరత్ కుమార్
- ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
- సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు
వరంగల్ | ఎన్ టుడే న్యూస్ | అక్టోబర్ 26: జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ సర్కిల్‌లో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారానికి 14వ రోజుకు చేరుకుంది. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని జేఏసీ నాయకులు కోరారు.
ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డా. టీ. భరత్ కుమార్ మాట్లాడుతూ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు హెల్త్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్, లాయల్టీ బోనస్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
జాతీయ ఆరోగ్య మిషన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భీమా వంటి సౌకర్యాలు కల్పించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా, ఆర్‌బీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షుడు డా. వలబోజు మోహన్, రాష్ట్ర ఆర్గనైజర్ డా. గూండా రవీందర్, డా. దిలీప్, డా. కిరణ్, డా. హుస్సేన్, డా. హరికృష్ణ, డా. సదానందం, డా. మధు, డా. ఐశ్వర్య, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ అర్చన, ఈవిన్ మేనేజర్ రవీందర్, డా. సునీతా దేవి, నర్సంపేట పల్లె దవాఖాన వైద్యుడు డా. శ్రవణ్ కుమార్, నర్సంపేట టీ-హబ్ వైద్యురాలు డా. బిర్రు స్వప్న, జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ మేనేజర్ మేర్గు అనిల్ కుమార్, ఫిజియోథెరపిస్ట్ పవన్, మెడికల్ సోషల్ వర్కర్ మండల లావణ్య, ఆడియాలజిస్ట్ వనజ, ఆప్టోమెట్రిస్ట్ అమూల్య, ల్యాబ్ టెక్నీషియన్ మాధవి, సైకియాట్రిస్ట్ ప్రశాంత్, స్పెషల్ ఎడ్యుకేటర్ రమేష్, నర్సింగ్ ఆఫీసర్లు కళ్యాణి, మంజుల, సుమలత, అకౌంటెంట్ ఆచంట అభిషేక్, టీబీ విభాగం సిబ్బంది రంజిత్, రాకేష్, ఏఎన్‌ఎంలు జ్యోతి, సుల్తానా, పేనీన, రాజేశ్వరి, ప్రభావతి, అనిత, శ్రీలత, ల్యాబ్ టెక్నీషియన్లు శోభ, మౌనిక, ఎంఎన్‌ఓలు ఏకుల చిరంజీవి, బండి రాజేష్, విజయ నాయక్, కలవల్ల కుమార్, సహాయక సిబ్బంది గౌస్ పాషా, రజియా తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.