గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ఏడు రోజుల్లో 9 కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
అమరావతి: రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల అభివృద్ధి కోసం గత ఏడు రోజుల్లోనే తొమ్మిది కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
‘అమరజీవి జలధార’ కార్యక్రమం ద్వారా రూ.30,136 కోట్లతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించేలా కార్యాచరణ చేపట్టినట్లు పేర్కొంది. జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ తాగునీటి సౌకర్యం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిపింది.
రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.