BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 06:35 pm
Posted by : K MAHESH

యాసంగిలో వరి సాగు వద్దు.. ఆరుతడి పంటల వైపు రైతులు మళ్లాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
10 Nov, 2026 - 06:35 PM
11 వీక్షణలు

ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల వైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

మహబూబాబాద్/గూడూరు, నవంబర్ 10 (ఎన్ టుడే న్యూస్):

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల తగ్గుదలను దృష్టిలో ఉంచుకుని ఈ యాసంగి సీజన్‌లో రైతులు వరి సాగు చేయకుండా ఆరుతడి పంటలు, ఉద్యాన పంటల వైపు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. వ్యవసాయంలో పంటల వైవిధ్యాన్ని పెంచడం ద్వారా రైతులు మెరుగైన ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

గూడూరు మండలంలో సోమవారం విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ భూపతిపేట రైతు వేదికలో నిర్వహించిన ఉద్యాన పంటల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల్లో ఉద్యాన, కూరగాయలు, ఆయిల్‌పామ్, మల్బరీ పంటల సాగు, వాటిలో పాటించాల్సిన మెరుగైన యాజమాన్య పద్ధతులపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ అధ్యక్షత వహించారు. అనంతరం క్షేత్రస్థాయిలో రైతులు సాగు చేస్తున్న కూరగాయల పంటలను పరిశీలించారు.

తక్కువ నీటితో సాగయ్యే పంటలకు ప్రాధాన్యం

ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం భూగర్భ జలాలు తగ్గుతున్నాయని, జలవిద్యుత్ ఉత్పత్తి కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేదని తెలిపారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడం వంటి పరిస్థితులను రైతులు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. వరి, మొక్కజొన్న, పత్తి, మిరప వంటి పంటలను అవసరానికి మించి సాగు చేయకుండా, నీటి లభ్యతను బట్టి పంటలను ఎంచుకోవాలని అన్నారు.

వరి సాగుకు విద్యుత్ వినియోగంపై ప్రభుత్వం ఎకరానికి రూ.50 వేలకుపైగా ఖర్చు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మిషన్ వైవిధ్యం ద్వారా అన్ని రకాల పంటలను అవసరానికి అనుగుణంగా సాగు చేయాలని సూచించారు. రైతులు, స్వయం సహాయక సంఘాలు కలిసి మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కూరగాయలు, పండ్లు, పూలు, నూనె గింజలు, ఆయిల్‌పామ్, అపరాలు, మల్బరీ, మునగ వంటి పంటల సాగుపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు.

కూరగాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు

మహబూబాబాద్ హార్టికల్చర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రీతం గౌడ్ మాట్లాడుతూ.. ఎల్‌నినో పరిస్థితుల్లో కూరగాయల సాగులో పూత, పిందె రాలిపోకుండా ప్లానోఫిక్స్‌ను 10 లీటర్ల నీటికి 3 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. మల్చింగ్, ఎత్తు మడులు, పందిరి సాగు, ట్రెల్లీస్ పద్ధతి, బిందు సేద్యం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించడం ద్వారా పంటల నిర్వహణ మెరుగుపడుతుందని వివరించారు.

మల్యాల ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎ. ప్రశాంత్ మాట్లాడుతూ.. పురుగుమందులను సిఫారసు చేసిన మోతాదులోనే వినియోగించాలని సూచించారు. మిరప, మామిడి తోటల్లో నల్ల తామర పురుగు నివారణ, మిరపలో వేరు కుళ్లు, కాండం కుళ్లు తెగుళ్ల నియంత్రణకు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని తెలిపారు. పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు.

కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ బి. దిలీప్ మాట్లాడుతూ.. ఎల్‌నినో పరిస్థితుల్లో తక్కువ నీటితో సాగు చేయగల పెసర, నువ్వులు, కుసుమలు తదితర అపరాలు, నూనె గింజల పంటలపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. రైతులు సొంతంగా విత్తనాలను సమకూర్చుకుని సాగుకు సిద్ధం కావాలని తెలిపారు.

విద్యుత్, నీటి వినియోగంపై అధికారుల సూచనలు

టీజీఎన్‌పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ దర్శన్ కుమార్ మాట్లాడుతూ.. తక్కువ విద్యుత్ వినియోగం అవసరమయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. ఎల్‌నినో పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, జలవిద్యుత్ ఉత్పత్తి అందుబాటులో లేకపోవడంతో విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జి. మధుసూధన్ రాజు మాట్లాడుతూ.. నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో రైతులు వీబీజీ రామ్ జీ పథకం కింద నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా అందుబాటులో ఉన్న ఇతర ప్రయోజనాలను కూడా రైతులు వినియోగించుకోవాలని కోరారు.

జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. విజయ చంద్ర మాట్లాడుతూ.. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. జిల్లా భూగర్భ జలాల అధికారి రవి మాట్లాడుతూ.. భూగర్భ జలాలు తగ్గుతున్నందున నీటి లభ్యతను అంచనా వేసుకుని పంటలు సాగు చేయాలని సూచించారు.

జిల్లా కోఆపరేటివ్ అధికారి ఎం. సర్దార్ సింగ్ మాట్లాడుతూ.. సహకార సంఘాల ద్వారా రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ కె. యాదగిరి మాట్లాడుతూ.. రైతులకు బ్యాంకుల ద్వారా అవసరమైన రుణ సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు.

జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి జినుగు మరియన్న మాట్లాడుతూ.. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల్లో ఉద్యాన, కూరగాయలు, ఆయిల్‌పామ్, మల్బరీ పంటల సాగు విధానాలతో పాటు వాటికి సంబంధించిన యాజమాన్య పద్ధతులు, ప్రభుత్వ రాయితీలపై రైతులకు అవగాహన కల్పించారు.

కూరగాయల సాగుతో ఎకరానికి రూ.2 లక్షలకు పైగా ఆదాయం

అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్ క్షేత్రస్థాయిలో కూరగాయల సాగును పరిశీలించారు. మహిళా రైతు కట్ట సునిత, వెంకట్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా ఉద్యాన శాఖ ద్వారా కూరగాయల పందిరి, మల్చింగ్, బిందు సేద్యానికి సంబంధించిన రాయితీలను పొందుతూ బీర, కీర, పప్పు దోస, టమాట తదితర కూరగాయలను సాగు చేస్తున్నారు. ఎకరంలో రెండు పంటల ద్వారా రూ.2 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ విధంగా కూరగాయల సాగుతో ఆదాయం పొందుతున్న రైతులను కలెక్టర్ అభినందించారు.

భీముని జలపాతం సందర్శన.. కార్యాలయ తనిఖీ

గూడూరు మండల పర్యటనలో భాగంగా కలెక్టర్ భీముని జలపాతాన్ని సందర్శించారు. అక్కడ ఫారెస్ట్, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ అధికారులతో వివిధ అభివృద్ధి పనులు, భూ సమస్యలపై చర్చించారు. అనంతరం మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ అధికారి జినుగు మరియన్న, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జి. మధుసూధన్ రాజు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. విజయ చంద్ర, జిల్లా కోఆపరేటివ్ అధికారి ఎం. సర్దార్ సింగ్, జిల్లా వెటర్నరీ అండ్ పశుసంవర్ధక అధికారి డాక్టర్ బి. కిరణ్ కుమార్, టీజీఎన్‌పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ దర్శన్ కుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి జె. నరేందర్, జిల్లా భూగర్భ జలాల అధికారి రవి, లీడ్ బ్యాంక్ మేనేజర్ కె. యాదగిరి, కేవీకే మల్యాల ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ బి. దిలీప్, హెచ్‌ఆర్‌ఎస్ మల్యాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ. ప్రశాంత్, హార్టికల్చర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రీతం గౌడ్, హార్టికల్చర్ అధికారి శాంతి ప్రియదర్శిని, మండల వ్యవసాయ అధికారి ఎం.డి. అబ్దుల్ మాలిక్, ఎంపీడీఓ శాస్త్రి, తహసీల్దార్ నాగ భవాని, భూపతిపేట సర్పంచ్ హేమ, సీతానాగారం సర్పంచ్ మంగీలాల్, చిన్న ఎల్లాపూర్ సర్పంచ్ నీల, వెంగంపేట సర్పంచ్ జవహర్, ఉప సర్పంచ్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.