BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 29 September 2026, 10:36 pm
Posted by : DAVU RAVINDER REDDY

తెలంగాణలో కొత్తగా 41 ‘2బీ’ బార్లకు నోటిఫికేషన్

తెలంగాణ
29 Sep, 2026 - 10:36 PM
8 వీక్షణలు

క్యూర్ పరిధిలో 14 బార్లు
ఏ ప్రాంతాల్లో కొత్త బార్లు?

తెలంగాణ బ్యూరో / ఎన్‌టుడే న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 41 ‘2బీ’ బార్ల ఏర్పాటుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, మున్సిపాలిటీల్లో సమీప గ్రామాల విలీనం ద్వారా పెరిగిన జనాభా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) నిబంధనల ఆధారంగా కొత్త బార్లకు అనుమతులు ఇచ్చినట్లు ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ తెలిపారు.

కొత్త బార్లకు సోమవారం నుంచి అక్టోబర్ 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో దరఖాస్తుకు రూ.1 లక్ష నాన్-రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.

కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి ప్రాంతాల్లో 14 బార్లను కేటాయించారు. మిగిలిన రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 27 బార్లను కేటాయించారు.

క్యూర్ పరిధిలోని 14 బార్లకు సంబంధించిన దరఖాస్తులను నాంపల్లిలోని అబ్కారీ భవన్‌లో ఉన్న కమిషనర్ కార్యాలయంలో లేదా క్యూర్ పరిధిలోని డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాల్లో సమర్పించవచ్చు.

మిగిలిన జిల్లాల్లో కొత్త బార్లకు సంబంధించిన దరఖాస్తులను సంబంధిత ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలతో పాటు అబ్కారీ భవన్ లేదా స్థానిక డీపీఈఓ కార్యాలయాల్లో సమర్పించే అవకాశం కల్పించారు.

సైబరాబాద్ డీసీ పరిధిలోని అలియాబాద్‌లో ఒకటి, మూడు చింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీల్లో రెండేసి బార్లకు అనుమతి ఇచ్చారు. రంగారెడ్డి డీసీ పరిధిలో ఫ్యూచర్ సిటీ, చేవెళ్లలో ఒక్కో బార్, మొయినాబాద్‌లో రెండు బార్లకు దరఖాస్తులు ఆహ్వానించారు.

అలాగే వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, పరిగి, సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం, కోహీర్, గుమ్మడిదల, ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట, కల్లూరు, మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్, మహబూబ్‌నగర్, దేవరకద్ర, నిజామాబాద్ జిల్లాలోని బోధన్, కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద, వరంగల్ జిల్లాలోని నర్సంపేట, జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్, మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం, ములుగు మున్సిపాలిటీల్లో కొత్త బార్లకు కేటాయింపులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.