శానంపూడిలో పోషకాహార మహోత్సవం, అంగన్వాడీ ఉత్సవాలు
సింగరాయకొండ: మండలంలోని శానంపూడి గ్రామంలో టంగుటూరు ప్రాజెక్టు పరిధిలోని ఊళ్లపాలెం సెక్టార్ శానంపూడి–2 అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మహోత్సవం, అంగన్వాడీ ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు.
సీడీపీఓ వై. అంజమ్మ ఆదేశాల మేరకు సూపర్‌వైజర్ ఎస్.కే. సైదాబీ సమక్షంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులు, తల్లులకు పోషకాహారం, పోషక విలువలు, ఆకుకూరల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించారు.
అనంతరం తల్లులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రీ-స్కూల్ కార్యక్రమాలకు పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రానికి పంపిస్తున్న తల్లులను ఈ సందర్భంగా సత్కరించారు.
కార్యక్రమంలో హెచ్‌పీ స్కూల్ టీచర్ అనూష, అంగన్వాడీ కార్యకర్తలు కే. శివకుమారి, ఎం. ఏసుదయమ్మ, ఎం. రాజేశ్వరి, ఏఎన్‌ఎం నర్సు లక్ష్మీగాయత్రి, ఆయాలు పాల్గొన్నారు.