పోలవరం పీఏసీఎస్‌ను సందర్శించిన నూజివీడు విభాగ శాఖ అధికారి
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా పోలవరం పీఏసీఎస్‌ను నూజివీడు విభాగ శాఖ అధికారి రవి కుమార్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు యర్ర ప్రసాద్ రావు ఆయనకు ఘనంగా సన్మానం చేశారు.
అనంతరం పీఏసీఎస్ కార్యకలాపాలను పరిశీలించి, సొసైటీ ద్వారా సభ్యులకు అందుతున్న సేవలు, ప్రస్తుత కార్యకలాపాలు, భవిష్యత్ అభివృద్ధి అంశాలపై చర్చించారు. సొసైటీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, సభ్యులకు మరింత మెరుగైన సేవలు అందించే అంశాలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు.
అధికారి సందర్శన సందర్భంగా సొసైటీ సిబ్బంది, సభ్యులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. కార్యక్రమం సాదరమైన వాతావరణంలో కొనసాగింది.